Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమంతా... ఏ టైమ్ లో పుట్టావమ్మా?... నీ జాతకానికో దండం: చార్మీ

  • హిట్ మీద హిట్ కొడుతున్న సమంత
  • మంచి టాక్ తో నడుస్తున్న 'ఓ బేబీ'
  • ప్రశంసల వర్షం కురిపించిన చార్మీ
అక్కినేని వారింటి కోడలిగా మారిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ, హిట్ మీద హిట్ కొడుతున్న సమంతపై నటి ఛార్మి ప్రశంసల వర్షం కురిపించింది. సమంత నటించిన తాజా చిత్రం 'ఓ బేబీ' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, సినిమా అద్భుతంగా ఉందని చార్మి వ్యాఖ్యానించింది. "ఏ టైమ్ లో పుట్టావమ్మా నువ్వు. నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్, ని జాతకానికో నమస్కారం. నీకు, నందినీరెడ్డి టీమ్ కు శుభాభినందనలు" అని ట్వీట్ చేసింది. దీనికి సామ్‌ రాక్స్‌, ఓ బేబీ రాక్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ లను జత చేసింది.
chanrmi Kaur
Oh Baby
Samanta

More Telugu News